నేడు విజ్ఞాన్ హై స్కూల్ ఆనందోత్సవం 

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ హై స్కూల్ ను నగరంలోని ఓల్డ్ ఎన్జీవో ఎస్ కాలనీ సుభాష్ నగర్ నిజాంబాద్ లో గత 30 సంవత్సరాలుగా అనగా 1993 లో స్థాపించడం జరిగిందని 2023 తో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఆనందోత్సవం (అన్యువల్ డే సెలబ్రేషన్) నేడు అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు  కవిత జయసింహ గౌడ్ గురువారం ప్రకటనలో తెలియజేశారు.
30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదివి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. నేడు జరగబోయే అన్యువల్ డే సెలబ్రేషన్స్ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతాయని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ తోపాటు స్పెషల్ గెస్ట్ గా ఫేమస్ ఫిలిం యాంకర్ మృదుల జబర్దస్త్ ఫేమ్ జబర్దస్త్ రాము హాజరవుతున్నట్లు తెలిపారు. మొదట ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వెల్కం అడ్రస్, హెడ్ బై రిపోర్ట్, స్కూల్ రిపోర్ట్ బై ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యం, ముఖ్య అతిథులు మాట్లాడిన అనంతరం కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయని అనంతరం హోటల్స్ తో ముగిస్తూ చివరగా జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుందని తెలియజేశారు. కావున పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మిత్రులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.