న్యాయ విద్యార్థులు గొప్ప సిటిజన్స్‌గా ఎదగాలి

– న్యాయ విద్యా ఔన్నత్యాన్ని కాపాడాలి
– హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భూయన్‌
నవతెలంగాణ-ఓయూ
న్యాయ విద్యార్థులు గొప్ప సిటిజన్స్‌గా ఎదగాలనీ, న్యాయ విద్యా ఔన్నత్యాన్ని పెంపొందిం చాలని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భూయన్‌ అన్నారు. ఓయూ న్యాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న డుసీమస్‌ 2023 ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి ఓయూ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ ఓయూ లా కళాశాలా న్యాయ విద్యకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. న్యాయ విద్యార్థులకు అనేక అవకాశాలు ఈ రంగాల్లో ఉన్నాయనీ, వాటిని అందిపుచ్చుకుని జీవితంలో గొప్ప న్యాయవా దులు, జడ్జిలు, జస్టిస్‌లుగా రాణించాలని సూచించారు. విద్యార్థులు ప్రతి పోటీల్లో పాల్గొని గెలుపు, ఓటములు ఏమైనా స్వీకరించిన ముందుకు సాగాల న్నారు. విజేతలకు పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ ఆఫ్‌ తెలంగాణ బి.శివానంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎంతోమంది నిపు ణులు, మేధావులను, గొప్ప గొప్ప జడ్జీలను న్యాయస్థానం అందించిన వేదిక ఓయూ న్యాయ కళాశాల అన్నారు. ఇది గొప్ప వృత్తి అనీ, అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్‌ డా.డి.రాధిక యాదవ్‌, లా హెడ్‌ ప్రొ.వెంకటేశ్వర్లు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకులాభరణం కృష్ణ మోహన్‌ రావు, ఎమ్మెల్యే బాలరాజ్‌, లీగల్‌ సెల్‌ డెరైక్టర్‌ ప్రొ.విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ, లా కళాశాల ఆలూమినీ అధ్యక్షుడు నారపరాజు, రామచంద్ర రావు తో పాటు 18 కళాశాలల న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. 15 పైగా కార్యక్రమల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అథితుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.