పలకరించొద్దు

ఎలావున్నావని అడగొద్దు నన్ను
కొలాంగ్‌ నదిలో తేలుతూ వస్తోంది
తలలేని అమ్మాయి, నా మతదేహం కోసం.
నలభై రెండు గంటలుగా పడివుంది,
అది గౌహతి రహదారి పక్కన.
నేనింకా కళ్లు తెరిచే వున్నాను
నా మత్యువు కూడా తన కళ్లు తెరిచే వుంది
పక్కనే చెరువులూ నదులను తలపించే బురద గుంటల్లో
బొలెడన్ని చేపలు గిలగిలకొట్టుకుంటున్నాయి
హే, నా అశ్వికుడా, విశ్రాంతి తీసుకో.
అస్సామీ : నీల్మణి ఫూకన్‌
తెలుగు : దేశరాజు