– శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ల అంశాలపై చర్చ
– స్టాండింగ్ కమిటీ సమావేశంలో12 అంశాలకు ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌లోని పశ్చిమ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై జీహెచ్‌ఎంసీ దృష్టిసారించింది. అందులోభాగంగానే గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 13 అంశాలకు గాను 12 అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. 12 అంశాలు రెండు జోన్లకు చెందినవిగా ఉన్నాయి.
స్టాండింగ్ కమిటీలో 12 అంశాలకు ఆమోదం
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2022 నుంచి 2025 వరకు మూడు సంవత్సరాల పాటు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ నుంచి చందానగర్ రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ మీడియన్స్ నిర్వహణ చేపట్టడానికి కమలాసన ప్రాపర్టీస్, సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ మధ్య ఎంఓయూ చేసుకోవడానికి అనుమతిస్తూ కమిటీ ఆమోదం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిల్ నెంబర్ 21 నందు ఆర్టీవో ఆఫీస్ కొండాపూర్ నుంచి ఆల్విన్ క్రాస్‌రోడ్ వరకు సెంట్రల్ మీడియాను అక్టోబర్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు ఒక సంవత్సర కాలంపాటు నిర్వహణకు కిమ్స్ హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రయివేట్ లిమిటెడ్, శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ మధ్య ఎంఓయూకు చేసుకోవడానికి కమిటీ ఆమోదం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేర్లింగంపల్లిజోన్‌లోని సర్కిల్ నెంబర్ 20లో సర్వే నెంబర్ 73, భాగ్యలక్ష్మీ నగర్‌కాలనీలోని జీహెచ్‌ఎంసీ ఓపెన్‌స్పేస్ 9550.02 చదరపు గజాలు సుందరీకరణ, అభివృద్ధి కోసం కమలాసన ప్రాపర్టీస్ అండ్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, (చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ రిప్రజెంటేషన్) శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ మధ్య 2022-23 సంవత్సరానికి ఎంఓయూ పొందిన తేదీ నుంచి మూడు నెలలపాటు అభివృద్ధి చేసేందుకు కమిటీ ఆమోదం. శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిల్ నెంబర్ 20 వార్డ్ నెంబర్ 105నందు మోడల్ కారిడార్ నానక్‌రామ్‌గూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ఐటీ హైట్స్ రోడ్ వరకు రూ.5.50కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పరిపాలన ఆమోదం కోసం కమిటీ ఆమోదం. శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిల్ నెంబర్ 20, వార్డ్ నెంబర్ 104 నందు మోడల్ కారిడార్ బయోడైవర్సిటీ నుంచి లెదర్ ఇన్స్టిట్యూట్ లెఫ్ట్ సైడ్ వరకు రూ.6 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి కమిటీ ఆమోదం. శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిల్ నెంబర్ 20, వార్డ్ నెంబర్ 105 నందు మోడల్ కారిడార్ ఐటీ హైట్స్ రోడ్ నుంచి వయా కాజాగూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వరకు రూ. 5.20కోట్ల అంచనా వ్యయంతో డెవలప్మెంట్ చేసేందుకు కమిటీ ఆమోదం. కూకట్‌పల్లి జోన్ చందానగర్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నార్ని రోడ్డు నుంచి నేషనల్ హైవే 65 జీఎస్‌ఎం మాల్ వయా ఆర్టీసీ కాలనీ వరకు నిర్మించేందుకు కావాల్సిన 28 ప్రాపర్టీల సేకరణకు కమిటీ ఆమోదం. చార్మినార్ జోన్ బహదూర్‌పుర నియోజకవర్గంలో కేఎస్‌టుబి అలియాబాద్ నాలాపైన స్ట్రామ్ వాటర్ డ్రైన్‌ను చున్నె కె బట్టి నుంచి అంజాద్ దౌలాభాగ్ వరకు రూ.5.95కోట్ల వ్యయంతో నిర్మించడానికి కమిటీ ఆమోదం. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న కాలనీ పార్క్‌కు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న మెయింటెనెన్స్ చార్జెస్ కాంట్రిబ్యూషన్ 75 శాతం నుంచి సంవత్సరానికి ఐదు శాతం పెంపునకు కమిటీ ఆమోదం. కూకట్‌పల్లిజోన్ సర్కిల్ నెంబర్ 23 వార్డ్ నెంబర్ 115 బాలాజీ నగర్ వద్ద 100 మీటర్ల బీటీ రోడ్ వెడల్పునకు, సెంట్రల్ మీడియం, గ్రీనరీ, లైటింగ్, స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏర్పాటుకు వాసవిగ్రూప్ ఎల్‌ఎల్‌పీ, జోనల్ కమిషనర్ మధ్య ఎంఓయూలకు కమిటీ ఆమోదం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూకట్‌పల్లి జోన్ సర్కిల్ నెంబర్ 23 వార్డ్ నెంబర్ 115 బాలాజీ నగర్ హెచ్‌ఐజీ పార్క్ అభివృద్ధికి జెమిని ఎడిబుల్ లిమిటెడ్‌కు, జోనల్ కమిషనర్ కూకట్‌పల్లి ఎంఓయూ చేసుకోవడానికి అనుమతిస్తూ కమిటీ ఆమోదం. సీఎస్‌ఆర్ ద్వారా జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సొంత నిధులు రూ.2 కోట్లతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5 నందు చేపడుతున్న పనులను పూర్తి చేసేందుకు హెచ్‌ఐజీ పార్క్ అభివృద్ధికి కమిటీ ఆమోదం.