నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో ప్రథమ చికిత్స కేంద్రాలైన పి ఎం పి, ఆర్.ఎం.పి క్లినిక్ లపై గురువారం ప్రభుత్వ వైద్యులు తనిఖీలు, క్లినిక్ సీజ్ చేయడం జరిగింది. అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మానస రెడ్డిపేటలో బొం బోతుల లక్ష్మీనారాయణ క్లినిక్ పై దాడులు నిర్వహించి, రోగులకు గ్లూకోస్ పెట్టడం, యాంటీబయోటిక్ మందులను గుర్తించారు. రామారెడ్డి లో ప్రైవేట్ క్లినిక్ ను రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సీజ్ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పి ఎం పి వైద్యునికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకిన రోగులకు వైద్యం నిర్వహించకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని, పరిధి దాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లచ్చిరాం, వైద్య సిబ్బంది జార్జ్, రాజు, రాణి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.