శునకాలకు ఎంటీ ర్యాబిస్ టీకాలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో గురువారం పశు వైద్యాధికారి దేవేందర్ ఆధ్వర్యంలో శునకాలకు ఏంటి ర్యాబిస్ టీకాలను వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడుతూ.. పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు వచ్చే వ్యాధులను జోనోటిక్ వ్యాధులు అంటారు. ఈ సంవత్సరం జులై ఆరవ తేదీ నాడు ప్రపంచ జెనొటిక్ దినోత్సవం సందర్భంగా శునకాలకు ఏంటి ర్యాబిస్ టీకాలను వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జనగామ శ్రీనివాస్, ఉప సర్పంచ్ లతా సుధాకర్, ఎంపీటీసీ మీనా దుర్గ బాబు, విడిసి చైర్మన్ బలరామ్, అరుణ్, రాజు, రమేష్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love