పీడీఎస్‌యూ నేతల అరెస్ట్‌

– చలో అసెంబ్లీ ఉద్రిక్తం
నవతెలంగాణ-అంబర్‌పేట
విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పీడీఎస్‌యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.రామకృష్ణ, నామాల ఆజాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం నేతలను అడుగడుగునా నిర్బంధించినా. అరెస్టులు చేసినా, చలో అసెంబ్లీ విజయవంతం అయిందన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయింపు లేకుంటే ప్రతిఘటన తప్పదని చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలో భర్తరఫ్‌ చేసి, సీఎం కేసీఆర్‌ తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్‌యూ నాయకులను పోలీసులు గాలించి, వెంటాడి అరెస్టు చేశారని, అయినా నిర్బాంధాలను ఛేదించుకుని నిరసన తెలిపామన్నారు.