పేరు మోసిన పాత నిందితుడు రిమాండ్‌

–  నిందితుడు వద్ద సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీి
టి .శ్రీనివాసరావు.
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేరు మోసిన పాత నిందితుడిని జీడిమెట్ల పోలీసులు వలవేసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు షాపూర్‌ నగర్‌లోని బాలానగర్‌ జోన్‌ డీసీపీ ఆఫీసులో డీసీపీ టి.శ్రీనివాసరావు, ఏసీపీ ఏ.గంగారంతో కలిసి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, బాల్కీ జిల్లా, జోషి నగర్‌లోని గుడిసె ప్రాంతాల్లో నివసించే కరణ్‌ సింగ్‌ అలియాస్‌ ధరమ్‌ సింగ్‌, అలియాస్‌ ఆనంద్‌ సింగ్‌, అలియాస్‌ కమ్మ సింగ్‌(34) గత కొన్నేళ్ల క్రితం నగరంలోని సూరారం గ్రామం ప్రాంతంలోని ఓంజెండా ఏరియాలో స్టీల్‌ సామాన్ల తయారీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్ననాటి నుండి ఏమి చదువుకోక చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దొంగతనాలే టార్గెట్గా చేసుకున్నాడు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో గతంలో ఓ రేప్‌ కేసులో ఇతను నిందితుడు. ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అంతేకాకుండా ఈ ప్రాంతం లోని జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్లో నాలుగు, జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్లో రెండు, చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు, తుకారం గేట్‌ పోలీస్‌ స్టేషన్లో 3, మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు, కామారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు ఉన్నాయని డిసిపి వివరించారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చినా కూడా జీవనశైలిలో మార్పు రాలేదని. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌, కామారెడ్డి, కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 20 దొంగతనాలలో విలువైన బంగారు, వెండి ,ఆభరణాలు చోరీ చేసి వాటిలో కొన్ని అవసరాల నిమిత్తం అమ్ముకొని మిగతా ఆభరణాలు నగదు ఇంటి వద్ద దాచి పెట్టాడని వివరించారు. పక్కా సమాచారం తెలుసుకున్న జీడిమెట్ల డిటెక్టివ్‌ డిఐ రామకష్ణ, ఎస్సై ఎం.ఆంజనేయులు  ఏర్పడి నిందితుడిని వలపన్ని చాకచక్యం గా పట్టుకున్నారు. ఇతని వద్ద నుండి 30 తులాల బంగారం ,1.26 కిలోల వెండి, 15 లక్షల నగదు, (మొత్తం 30 లక్షల విలువ) స్వాధీనం కొని రిమాండ్‌ కు తరలించారు. నిందితుడి పట్టుకోవడంలో తమ పోలీసు సిబ్బంది పనిచేసిన తీరును డీసీపీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందిం చారు. ఈ విషయాన్ని సైబరాబాద్‌ సీపీ దష్టికి తీసుకెళ్లి రివార్డు వచ్చే విధంగా చూస్తానన్నారు కార్యక్రమంలో . జీడిమెట్ల సిఐ పవన్‌ సిబ్బంది డి .రాజశేఖర్‌, టి లక్ష్మణ్‌ నరసింహ రవి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.