ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేస్తాం

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా హుస్సేన్‌ సాగర్‌ నాలా రిటర్నింగ్‌ వాల్‌ పనులు పూర్తి చేస్తామని ముషీరా బాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. సోమవారం గాంధీనగర్‌ డివిజన్‌ సబర్మతినగర్‌ బస్తీలో నాలా రిటర్నింగ్‌ వాల్‌ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హుస్సేన్‌ సాగర్‌ నాలా రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణంతో చుట్టుపక్కన లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది తెలిపారు. వరద నీరు సాఫీగా వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొని రిటర్నింగ్‌ వాల్‌ నిర్మిస్తామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జయసింహ, సీనియర్‌ నాయకులు ముఠా నరేష్‌, స్థానిక డివిజన్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ కుమార్‌, కార్యదర్శి పోతు ల శ్రీకాంత్‌, ఆకుల శ్రీనివాస్‌ ,మారిశెట్టి నర్సింగ్‌ రావు, ఎర్రం శ్రీనివాస్‌ గుప్తా, మచ్చకుర్తి ప్రభాకర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.