– హైదరాబాద్ డీఎస్‌వో రమేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు కమిటీలను ఏర్పాటు చేసి.. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ. రమేశ్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ అంబర్‌పేట్ సర్కిల్ విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని బుధవారం అంబర్‌పేట సర్కిల్ కార్యాల యంలో నిర్వహించారు. కమిటీ సభ్యులతో జాతీయ ఆహార భద్రత పథకం చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేం దుకు తీసుకోవాల్సిన అంశలపై చర్చించారు. అనంతరం డీఎస్‌వో రమేష్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరి చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా, మండల, సర్కిల్ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, స్థానిక సంఘాల కమిటీ ప్రతినిధులు, అంగన్వాడీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంఘాల సమన్వయంతో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు, అంబర్‌పేట సర్కిల్ ఏసీఎస్ దీప్తి, సర్కిల్ రేషన్ డీలర్ల సంఘం నాయకులు, ఐసీడీఎస్, ఎస్సీ, ఎస్టీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.