– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్‌లోని ఏంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తలపెట్టిన మన బస్తీ- మన బడీ కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పన దిశగా పనులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మార్తాండ్ నగర్‌లోని ఏంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వసతులను బీఆర్‌ఎస్ యూత్ నాయకులు అదిల్ పటేల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా మెరుగుపరచి, మౌలిక వసతులు సమాకుర్చటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.అనంతరం స్థానిక నాయకులు విద్యార్థులుగా మారి, స్థానిక ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, మంచిగా చదువుకుని, ఉన్నత స్థాయికి అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా టీఎస్‌ఈడబ్ల్యూఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. కుమార్‌గౌడ్, ఏఈ పి.విక్రమ్, ఏఈ ఏ. శ్యామ్, మండల విద్యాధికారి వెంకటయ్య, మియాపూర్ పాఠశాలల సముదాయ ప్రధానోపాధ్యాయురాలు కె. వసుంధర, స్థానిక పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మెన్ వి. ఈశ్వరి, మార్తాండ్ నగర్ ప్రభుత్వ ఏంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, కొండాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జె. బలరాంయాదవ్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, లింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ రాజుయాదవ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు రూపరెడ్డి, మొహ్మద్‌అలీ, తాడెం. మహేందర్, రజనీకాంత్, తిరుపతి యాదవ్, గణపతి, శారదా, మంగళరపు తిరుపతి, బండారి అక్షరు, అభి తదితరులు పాల్గొన్నారు.