నవతెలంగాణ-బంజారాహిల్స్
క్యాన్సర్ కారణంగా నాలుక పూర్తిగా తొలగించ బడి మాట కోల్పోవడమే కాకుండా ఇతరత్రా ఇబ్బందు లు ఎదుర్కొంటున్న వారికి సాధారణ జీవనం సాధించ వచ్చనే విశ్వాశాన్ని కలిపించే ప్రయత్నంలో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు చెందిన హెడ్ అండ్ నెక్ విభాగం వారు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇటీవల కాలంలో అందుబాటులోనికి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాల కారణంగా ఇబ్బందులు పాలవుతున్న వారికి ఊరట కలిగించి తద్వారా సాధారణ జీవనాన్ని గడిపే అవకాశం ఏర్ప డింది. ఈ సదవకాశాన్ని పేషెంట్లకు అందించి తద్వా రా వారిని సాధారణ జన జీవన స్రవంతిలో భాగంగా చేయడం ద్వారా గౌరవప్రదమైన, స్వతంత్య్రమైన జీవనాన్ని గడిపేందుకు దోహద పడేలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టి ట్యూట్‌లోని సర్జికల్ ఆంకాలజీ డిపార్మెంట్ లో భాగమైన హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగంకు చెందిన డా.చంద్ర శేఖర రావు నేతృత్వంలో ప్రత్యేకమైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఏర్పాటు చేశారు. అంకాలజీ సర్జన్స్, ఫిజిషియన్స్, స్పీచ్ ధెరపిస్టులు వంటి వారితో ఏరపడిన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో భాగంగా ఉంటూ స్వర పేటిక క్యాన్సర్ కారణంగా పూర్తిగా మాట కోల్పోయిన పేషెంట్లను గుర్తించి వారిలో ముందుకు వచ్చిన ఔత్సాహికులను గ్రూపులో సభ్యులుగా చేర్చారు. ఇలా గ్రూపులో భాగస్వాములై పెషెంట్ల అవసరాల కనుగుణంగా వైద్యులు, స్పీఛ్ థెరపిస్టులు కలసి చికిత్సను అందించడం ప్రారంభమైంది. దీర్ఘ కాలం సాగే ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి పేషెంట్ల తో పాటూ వారి కుటుంభ సభ్యులు, స్నేహితుల సహా య సహకారాలు, మద్దతు ఎంతో అవసరమని గుర్తించిన వైద్య బృందం వారిని కూడా ఈ స్వయం సహాయక బందంలో భాగస్వాములుగా చేసింది. ఈ స్వయం సహాయక బృందం సభ్యులందరూ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో భాగమైన హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగంకు చెందిన డా. చంద్ర శేఖర రావు మాట్లాడుతూ ప్రయ త్నం చేస్తే ఎలాంటి వైకల్యాన్ని కూడా అధిగమించవచ్చ ని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించదలిచామని చెప్పారు. ఇలాంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారి సమస్యలకు సమాధానం ఉందనే విశ్వాసం నెలకొల్ప డం కూడా కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని వివరించా రు. ఇకపై స్వర పేటిక కోల్పోయిన వారు నిశ్సబ్దాన్ని విడనాడి ధైర్యంగా తమ తమ సాధారణ జీవనాన్ని గడుపవచ్చనే సందేశం ఇందులో ఇమిడి ఉందని అంటూ ఇది ఒక్క సంస్థ పనే అనుకోకుండా ఇతర ప్రాంతాలలోని సంస్థలు కూడా చేపడితే అందరికీ ప్రయోజనం కలుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.టిఎస్ రావు, మెడికల్ డైరెక్టర్లు ఢా.ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపరింటెండెంట్, డా.ఎల్‌ఎం.చంద్రశేఖర రావు, హెడ్ అండ్ నెక్ సర్జికల్ విభాగాధిపతి, డా. హేమంత్, డా.జొనాథన్, పార్థసారథి, స్పీఛ్ థెరపిస్టులు పాల్గొన్నారు.