బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని రామాలయంలో గురువారం బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత హామీలు, కేంద్ర నిధుల గోల్మాల్, ప్రజా సమస్యలపై ప్రజల్లో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఏర్పడి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్, నాయకులు గిద్ద వెంకన్న, నా రెడ్డి రాజిరెడ్డి, భూమా గౌడ్, కృష్ణ యాదవ్, పోసానిపేట గాండ్ల సాయిలు, పందుల గోపి, ఉప్పల్ వాయి శ్రీనివాస్, గోకుల్ తాండ శంకర్ నాయక్, సురేందర్ సింగ్, మల్లయ్య, రాజు, కన్నాపూర్ తాండ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.