భారత్‌లో మొత్తం టిక్‌టాక్‌ ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పని చేస్తున్న తన ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన ఈ యాప్‌ను దేశ భద్రత కారణాలతో 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. ఇక్కడ ఇప్పటికీ విదేశీ కార్యకలాపాల అవసరాల కోసం కొద్ది మంది ఉద్యోగులను కొనసాగిస్తుంది. భారత్‌ నుంచి బ్రెజిల్‌, దుబాయ్‌ మార్కెట్లకు పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తాజాగా తొలగించింది.