– బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-కాప్రా
బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం చౌరస్తా వద్ద నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మహాభోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు అని, ఆయన జయంతిని పండుగలా జరుపుకోవడం సంతోషకరం అన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియజేయ డానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపం చానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారన్నారు. దీంతో సంత్‌సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని తెలిపారు. మన సంస్కతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్‌గౌడ్, లంబాడి ఐక్యవేదిక మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు ధీరావత్ హనుమంత్ నాయక్, దశరథ్ నాయక్, చందర్ నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్, నరసింహా నాయక్, రెడ్డి నాయక్, యాదిరెడ్డి, విఠల్ నాయక్, శ్రీహరి, రాజు నాయక్, దశరథ్ నాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.