మరకలు పోవాలంటే..?

ఆహారపదార్థాలకు తీపి తెచ్చే పంచదారతో మరెన్నో ప్రయోజనాలూ ఉన్నాయంట. అవేంటంటే చూద్దాం… ఫ్లవర్‌వాజుల్లో నీళ్లు మార్చిన ప్రతిసారీ ఆ నీళ్లలో పావుకప్పు పంచదార కూడా కలిపితే పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. బేక్‌ చేసిన బిస్కెట్లూ, పఫ్‌లు నిల్వ చేస్తుంటే ఆ డబ్బాలో ఓ చిన్నమూటలో పంచదారని వేసి పెట్టండి. పదార్థాలు నిల్వ వాసన రాకుండా ఉంటాయి. దుస్తులపై పడ్డ ఆకు మరకలు పోవాలంటే గోరువెచ్చని నీళ్లలో పంచదారని కలిపి ఆ నీళ్లని మరకపై చిలకరించి పావుగంటపాటు వదిలేయాలి. కాసేపటికి సబ్బుతో ఉతికేస్తే మరక మాయమవుతుంది. చేతికంటిన మొండి గ్రీజు మరకలు పోవాలంటే కొద్దిగా పంచదార చల్లుకుని తర్వాత సబ్బుతో కడిగేసుకుంటే సరి. సులువుగా వదులుతుంది.