– కేంద్ర ఆరోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం మరో 30 నెలల్లో పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం కోసం రూ.1,366 కోట్లతో ఆమోదం పొందిందనీ, 2022 జూలైలో 36 నెలల్లో పూర్తి చేసేలా టెండర్ ఖరారైందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. దశల వారీగా పనుల ప్రగతి ఆధారంగా మిగిలిన నిధుల విడుదల ఉంటుందని స్పష్టం చేశారు.