మార్చి 10న డాక్‌ అదాలత్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పోస్టల్‌ సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారం, ఫిర్యాదులు, సలహాల స్వీకరణ కోసం మార్చి 10వ తేదీ వర్చువల్‌ మోడ్‌ (ఆన్‌లైన్‌)లో డాక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు సంబంధిం చిన సర్వీసు మేటర్లు, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను స్వీక రించబోమని తేల్చిచెప్పారు. ఈ అదాలత్‌లో పాల్గొనదలచినవారు మార్చి 3 లోపు పోస్టాఫీసుల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.