మురికివే వాడుతున్నారా?

వివిధ రకాల గృహోపకరణాలు, ఇతర వస్తువుల్ని మైక్రోఫైబర్‌ క్లాత్‌ లేదంటే కాటన్‌ క్లాత్‌తో శుభ్రం చేయడం మనకు అలవాటే! అయితే పని పూర్తయ్యే సరికి అవి మురికిగా తయారవుతాయి. వాటిని సాధారణ డిటర్జెంట్‌తో ఉతికి ఆరేసి తిరిగి వాడుకోవడం చాలామంది చేసే పని. అయితే ఇలా పైపైన ఉతకడం వల్ల అవి పూర్తిగా శుభ్రపడవు.. సరికదా.. వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే వాటి నుంచి అదో రకమైన వాసన కూడా వస్తుంటుంది. అందుకే అలాంటి మురికి క్లాత్స్‌, టవల్స్‌ని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. వేడి నీళ్లలో టేబుల్‌స్పూన్‌ వెనిగర్‌ వేసి ఈ క్లాత్స్‌ని అరగంట పాటు నానబెట్టి.. ఆ తర్వాత ఉతికి ఎండలో ఆరేయాలి. ఇలా ఉతికితే అవి శుభ్రపడడంతో పాటు వాటిపై ఉన్న మరకలు కూడా తొలగిపోతాయి. ఆపై తిరిగి వీటిని ఉపయోగించుకోవచ్చు. ప