మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు 8 వరకు పెంపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దరఖాస్తుల సమర్పణకు ఈనెల ఎనిమిదో తేదీ వరకు అవకాశముందని మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి తెలిపారు.