మోడీ తిరోగమన విధానాలతో దేశం వినాశనం

–  ఆలిండియా ఫార్వర్డ బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని నరేంద్ర మోడీ తిరోగమన విధానాలను అవలంభించడం వల్ల దేశం వినాశనమవుతున్నదని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌వి ప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తున్నదని చెప్పారు. బీజేపీ మత రాజకీయాలు దేశానికే ప్రమాదకరమని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ర్యాగింగ్‌ను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి రాములు యాదవ్‌, నాయకులు కొమ్మూరి వెంకటేశ్‌ యాదవ్‌, ఆవుల శ్రీకాంత్‌ యాదవ్‌, సయ్యద్‌ తౌఫిక్‌ అలీ, అజమత్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.