వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు

– కేటాయించడం ఇంటికో  ఈక ఉరికో కోడి అనే చందంగా ఉంది
నవతెలంగాణ-కంటేశ్వర్
వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం ఇంటికో  ఈక ఉరికో కోడి అనే చందంగా ఉందని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 48 లక్షలు వడ్డెర వృత్తిదారుల జనాభా ఉంటే కేవలం మూడు కోట్లు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. వడ్డెర వృత్తిదారుల సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వడ్డెర వృత్తిదారులకు కేవలం మూడు కోట్లు కేటాయించడం ద్వారా అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తుందని అన్నారు. గత సంవత్సరం కేవలం మూడు కోట్లు కేటాయించి ఇప్పటికీ ఆ మూడు కోట్లు విడుదల చేయలేదన్నారు కనీసం వడ్డెర వృత్తిదారులకు లోన్లు మంజూరు చేయలేదన్నారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 4000 సొసైటీలు ఉన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డెర వృత్తిదారులను గుర్తించి మా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. బడ్జెట్లో సుమారుగా 3000 కోట్లు కేటాయించి వడ్డెర వృత్తిదారులకు వడ్డెర బందును ప్రకటించి వెనుకబడిన వడ్డెర వృత్తిదారులకు 10 లక్షలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. అనేకమంది  డబల్ బెడ్ రూములు పెన్షన్లు అనేకమంది వృత్తిపరంగా చనిపోయిన గాని వారికి కనీసం ఎక్స్ప్రేషియా కూడా చెల్లించలేని దీని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యారంగుల కృష్ణ మాట్లాడుతు జిల్లాలో సుమారు 50 నుండి 60 వేల వడ్డెర జనాభా ఉన్నారు. ఇందులో 200 సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సొసైటీలకు 30 లక్షల రుణం ఇస్తామని ప్రభుత్వం చెప్పారు. అందులో 15 లక్షల సబ్సిడీ. ఈ సొసైటీలకు వెంటనే రుణాలు ఇవ్వాలని కార్యదర్శి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇడగొట్టి చిన్న ఓడ్డన్న , జిల్లా కమిటీ సభ్యులు గుంజ పాపన్న, బత్తుల ఒడ్డన్న, గోగుల ఎల్లయ్య, గోగుల ఎర్ర సాయిలు, కంది ఎల్లయ్య, కంది సాయిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.