హైదరాబాద్ : వాతావరణ మార్పులు, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ప్రత్యేక సెమినార్ నిర్వహించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగిన ఈ సదస్సుకు మునిచ్ రే, ఎస్‌అండ్‌పి గ్లోబల్, ఆర్‌బిఐ, బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, కన్సల్టెంట్‌లకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విలువైన సందేశాలను ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ ఇంద్రనిల్ భాంజా స్వాగతోపన్యాసం చేశారు. ఎస్‌బీఐ ఎండి అశ్విన్ కుమార్ తివారి మాట్లాడుతూ.. పర్యావరణంలో బ్యాంక్‌ల పాత్రపై మాట్లాడారు. పర్యావరణ రక్షణ, సవాళ్ల అంశంలో ఉద్యోగులు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.