వాహన పత్రాల తప్పనిసరిగా ఉండాలి- సబ్ ఇన్‌స్పెక్టర్ గాంధీ గౌడ్

నవతెలంగాణ-భిక్కనూర్
వాహనదారులు వాహనం నడుపుతున్న సమయంలో వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని  సబ్ ఇన్‌స్పెక్టర్ గాంధీ గౌడ్  వాహనదారులకు సూచించారు. గురువారం మండలంలోని 44వ జాతీయ రహదారిపై  టోల్ ప్లాజా వద్ద  వాహనాల తనకి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిమానాలు  పెండింగ్ లో ఉన్న 25 వాహనాలకు  20వేల రూపాయలు  వసూలు చేయడంతో పాటు  సీటు బెల్ట్, వాహన పత్రాలు, హెల్మెట్ ధరించని  18 వాహనాలకు  4,500 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.  ఈ వాహనాల తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ నరేందర్ రెడ్డి,  కానిస్టేబుల్ సిబ్బంది శ్రీరామ్, సేవియా నాయక్,  తదితరులు పాల్గొన్నారు.