వింత చింతలు….

శరీరం శిథిలం అవుతున్నా
మోహాలు దేహాన్ని వదలవు

వేరులు కదులుతున్న వక్షం మీద
కోరికలు ఇంకా వాలుతునే వుంటాయి

వీడుకోలు వేళ వచ్చింది
మనసు ఇంకా బంధాలు అల్లుకుంటూనే

రాలుతున్న వేళ
రంగులు తలనిండా అద్దుకుంటూ

బతుకు ఎందుకూ ఒప్పుకోదు
పిలుపు కూత వేటిని వాయిదా కుదురదని

టోకెన్‌ నంబర్‌ తెలిశాక
పట్టు విడుపుల పంతం

వన్‌ వే ప్రయాణానికి
తోడు వుండదని లగేజీ అవసరము లేదని

వింత చింతలు
మనిషిని ఫెవికాల్‌ లా వీడవెందుకు

– దాసరి మోహన్‌
9985309080