నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విద్యను అందించ డంతో భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధిస్తారని బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావు అన్నారు. సోమవారం ప్రగతి నగర్ లో గల శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఆమె పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్‌లను చూసి అభినందించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో మేధాశక్తి పెంపొందుతుందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, సుశీల్ కుమార్, భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.