నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్‌పల్లి గణేష్‌నగర్ కాలనీలోని వీఆర్ హాస్పిటల్‌లో యూరాలజీ వైద్య సేవలు నూతనంగా అందుబాటులోకి వచ్చాయని హాస్పిటల్ ఎండీ వై.నంద కిషోర్ తెలిపారు. సోమవారం హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ యురాలజీ వైద్యులు కృష్ణ కార్తీక్, పిడియార్టిక్ వైద్యులు శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. ఇప్పటికే హాస్పిటల్‌లో 24/7 చిన్నపిల్లలు వైద్య సేవలు అందుబాటులోకి ఉండగా ఇక నుంచి వారంలో 3 రోజులు ప్రముఖ యురాలజీ వైద్యులు కృష్ణ కార్తీక్ కూడా అందుబాటులో ఉంటాడని వెల్లడించారు. యురాలజీకి సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలు ఈ హాస్పిటల్‌లో చేయడబుతాయని చెప్పారు. తమకు వ్యాపారం ముఖ్యం కాకుండా సేవా భావంతో రోగులకు తక్కువ ఫీజుతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్, కృష్ణ కార్తీక్‌ను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ సన్మానించారు.