వీర మరణం పొందిన సైనికులకు నివాళులు

నవతెలంగాణ-కూకట్‌పల్లి
పుల్వామా దాడిలో వీర మరణం పొందిన భారత సైనికులకు, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌ జయంతి సందర్బంగా, మోతి నగర్‌, ఈ సేవ వద్ద పూల మాల వేసి నివాళులు అర్పించిన మూసాపేట్‌ కార్పొరేటర్‌ మహేందర్‌ కోడిచెర్ల, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కాపు కాసి మనల్ని రక్షించే భారత సైనికులనీ, ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ఉగ్ర మూకలు చేసిన దొంగ దాడిలో 40 మంది మన సైనికుల విరమరణం మరువలేనిదని, వారి త్యాగాన్ని దేశ ప్రజలంతా నేడు స్మరించుకోవాలన్నారు.దేశ మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌ లో గొంతెత్తిన బీజేపీ నాయకురాలు, తెలంగాణ చిన్నమ్మ గా పిలిచే సుష్మా స్వరాజ్‌ జయంతి నీ, గాని వర్ధంతి నీ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి పూల మాల వేసి నివాళులు అర్పించిన దాకలాలు లేవన్నారు, నాడు పార్లమెంట్‌లో ముక్కు పచ్చలారని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిధానం చేసుకున్నారని తెలంగాణ ప్రజలకు సొంత రాష్ట్ర ఇవ్వాలని, నాటి యూ పీ ఏ ప్రభుత్వాన్ని నిలదీసిన సుష్మ స్వరాజ్‌ రాష్ట్ర నిర్మాణం లో కీలక పాత్ర పోశించారని ఆమెకు తగిన గౌరవం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో డివిజన్‌ ఉపాధ్యక్షులు రమేష్‌ నాయర్‌ , శోభా రాజన్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి , భాస్కర్‌ , ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలాకి కిషోర్‌ , సతీష్‌ చారి, మల్లేష్‌ యాదవ్‌ , శ్రీకాంత్‌ , యోగేష్‌ , అనిల్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.