వెబ్‌సైట్‌లో ఇంటర్‌ విద్యార్థుల హాల్‌టికెట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈనెల 15 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఇంటర్‌ బోర్డు కార్యచదర్శి నవీన్‌ మిట్టల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఫొటో, పేరు, సంతకం, మాధ్యమం, సబ్జెక్టులు వంటి వ్యక్తిగత వివరాలను పరిశీలించాలనీ, తప్పులుంటే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల దృష్టికి తేవాలని కోరారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు.