వెల్నెస్ సెంటర్ ని మార్చండి ప్రభో..

– ప్రభుత్వ ఆస్పత్రిలో 4వ అంతస్తు ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు
– తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్కు విజ్ఞప్తి
నవతెలంగాణ- కంటేశ్వర్
ఎన్నిసార్లు వినతులు ఇచ్చినప్పటికీ సెంటర్ ను మార్చండి అంటే మార్చడం లేదని ప్రభుత్వాసుపత్రిలోనే నాల్గవ అంతస్తు ఎక్కాలంటే రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అందుకోసమని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ ను తక్షణమే అన్ని సౌకర్యాలు గల బిల్డింగ్ లోకి మార్చాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ సోమవారం జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు కి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ప్రభుత్వ  ఆస్పత్రిలో నాల్గవ అంతస్తులో ఉండటం మూలాన రిటైర్డ్ ఉద్యోగులు మందులు, వైద్య సహకారం పొందటంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగానగల ఖాళీగా ఉన్న నర్సింగ్ కాలేజ్, మెప్మా బిల్డింగ్ అనుకూలంగా ఉన్నాయని జిల్లా అధ్యక్షులు కే .రామ్మోహన్రావు కలెక్టర్ కి వివరించటం జరిగింది. కలెక్టర్ ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి ఎస్. మదన్ మోహన్, గౌరవ అధ్యక్షులు  దత్తాత్రేయరావు, కోశాధికారి ఈవిల్ నారాయణ, సహాధ్యక్షులు సుదర్శన్ రాజ్, ఉపాధ్యక్షులు , జార్జ్, భోజరావు, లావు వీరయ్య, ప్రసాద్ రావు, అందే సాయిలు తదితరులు పాల్గొన్నారు.