వేసవిలో శుద్ధమైన నీరందిస్తాం

–  మిషన్‌భగీరథ సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ వేసవిలో తాగునీటి ఇబ్బం దులు రానివ్వబోమనీ, అందరికీ మిషన్‌భగీరథ ద్వారా శుద్ధమైన నీటిని అందిస్తామని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గురు వారం హైదరాబాద్‌లో గల ఎర్ర మంజిల్‌లో మిషన్‌ భగీరథ- ఎండా కాలం సన్నద్ధతపై సమీక్షా సమావే శాన్ని నిర్వహించారు. రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటం కంగా నిర్వర్తించాల్సిన తాగునీటి సరఫరాపై మిషన్‌ భగీరథ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. వేసవిలో రిజర్వాయర్‌లలో నీటి నిలువలు తగ్గకుండా చూడా లని సూచిం చారు. కరెంట్‌ సప్లరు తోపాటు పైపులైన్‌లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. లీకేజీలు రాకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులను నియమిం చామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరెంటు సమస్య లొచ్చినా నీటి సరఫరాకు ఆటంకం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంపుల మెయిం టెనెన్స్‌ సరిగ్గా చూడాలనీ, పైప్‌లైన్‌ లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎప్పట ికప్పుడు ఫిల్టర్‌ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్‌ చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాల యాలకు తాగునీరు అందించా లన్నారు. ఈ సమీక్షలో ఈఎన్‌సి, ఈఈలు, అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.