సంక్షేమ సంఘం నాయకులను సత్కరించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-కూకట్‌పల్లి
బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని రాజీవ్‌ గాంధీనగర్‌ సంక్షేమ సంఘం ఎన్నికల్లో రెండోసారి అధ్యక్షుడుగా గెలుపొందిన అబ్దుల అజీజ్‌ని, మరియు రెండోసారి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన ఎన్‌కే.నరేష్‌ను కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, కూకట్‌పల్లి కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ, కూకట్‌పల్లి క్యాంప్‌ కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, రాజీవ్‌ గాంధీ నగర్‌ బస్తీలో 380 ఓట్లు పోలింగ్‌ కాగా, అందులో అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌కి 216 ఓట్లు, 99 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం, ప్రధాన కార్యదర్శి నరేష్‌కి 234 ఓట్లు, 104 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఇందిరానగర్‌ అధ్యక్షుడు గోవు వెంకటరెడ్డి, ఏరియా కమిటీ అధ్యక్షుడు నగేశ్‌, సుల్తాన్‌, బస్తీ అధ్యక్షుడు ఫాయక్‌ అలి, లాలూ, సర్దార్‌, గౌస్‌, మోయిన్‌, శంశు మరియు తదితరులు పాల్గొన్నారు.