నవతెలంగాణ-కల్చరల్
సంప్రదాయ కళలు పండుగలు తెలుగు వారికి గుర్తింపు తెస్తాయని వీటిని పరిరక్షించు కొంటూ ముందు తరాలకు అందించవలసిన అవసరం ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై భారత్ ఆర్ట్స్ అకాడెమీ, ఏబీసీ ఫౌండేషన్ నిర్వ్యహణలో సంక్రాంతి సంబరాలు పేరిట సంగీత నత్య కార్యక్రమాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్టాల నుంచి పలువురు కళా కారులు శాస్ట్రీయ నత్యాలతో లలిత గీత గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదర్ మాట్లాడుతూ సంస్కతిని సామాన్యులకు సైతం అందించేలా భారత్ ఆర్ట్స్ అకాడమీ వేదిక కల్పిస్తోందని, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఇప్పించటం అభినందనీయమన్నారు. భారత్ వరల్డ్ రికార్డ్ అధ్యక్షుడు లయన్ కె.వీ. రమణారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రెండు వందల పైగా నత్య సంగీత కళాకారులు అన్ని వయస్సుల వారూ ప్రదర్సన లలో పాల్గొన్నారని తెలిపారు. బోనాల ప్రతి నిధి శ్యామల దేవి, నటి శైలజ, ప్రిన్స్ సెస్ నైరా తదితరులు సభలో పాల్గొన్నారు. సామాజిక సేవకుడు సత్యవేణి శర్మ, శ్వేత, నిర్మల, నాట్య సంగీత గురువులు పద్మజ, కల్యాణి, మాధురి, మైధిలి,శ్రీ లక్ష్మి, శివ జ్యోతి, వరలక్ష్మి, రేఖ, బద్రి నాధ్, సమంత రావు, నవ్య, పద్మావతి, శైలజ తదితరులను సంక్రాంతి నంది పురస్కరాలతో సత్కరించారు. లలితా రావు నిర్వహణలో జరిగిన సత్కార కార్యక్రమంలో రమణా రావు స్వాగతం పలికారు.