సమస్యలను పరిష్కరించాలని వినతి

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఖైరతాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం వెనకాల గల క్వార్టర్స్‌ వర్షపు నీరు వెళ్లడానికి తమ ముద్రణాలయ స్కూటర్‌ స్టాండ్‌ నుంచి అధికారులు నాలా లైను నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో స్కూటర్‌ స్టాండ్‌కు నష్టం జరిగిందనీ వెంటనే మరమ్మతులు చేయించాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సర్కుల్‌ 17 అధికారికి తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా మెమోరండం అందజేసింది. ఈ సందర్భంగా అధికారులు సానుకూలంగా స్పందించి వెంటనే నిర్మాణం చెపడుతామని హామీనిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆర్‌.ఈశ్వర్‌, జి.మల్లికార్జున్‌, యస్‌.విశ్వసేన, కె.శ్రీకాంత్‌, జి.శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.