సమస్యలు పట్టని సర్కార్‌ పై సమరభేరి

– టీపీసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌
– పీర్జాదిగూడలో గడప గడపకు హాత్‌ సే హాత్‌ జోడో
– ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదు
– కాంగ్రెస్‌ పీర్జాదిగూడ అధ్యక్షుడు తుంగతుర్తి రవి
నవతెలంగాణ-బోడుప్పల్‌
కాంగ్రెస్‌ పార్టీ పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా గడపగడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పాల్గొని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. గడపగడప కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం మొదటిరోజు పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒకటవ డివిజన్లో విజయవంతంగా సాగింది. ఒకటో డివిజన్‌ కాలనీలలో ప్రతి గడపగడపకు తిరుగుతూ కార్పొరేషన్‌లో ఉన్న పెండింగ్‌ సమస్యలను కరపత్రం రూపంలో ప్రజలకు అందిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజా ప్రతినిధులు పాలన పక్కకు పెట్టి పంపకాల గొడవలతో కాలయాపన చేస్తున్నారని ఒకటో డివిజన్లో సరైన సీసీి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేదని అన్నారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ మొదటి డివిజన్లో వరద ప్రభావిత కాలనీలు ఎక్కువగా ఉన్నాయని గతంలో వచ్చిన వరదలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని త్వరగా ఎస్‌ ఎన్‌డిపి పనులు పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి సరిత వెంకటేష్‌, మేడ్చల్‌ నియోజకవర్గం బి బ్లాక్‌ అధ్యక్షులు వేముల మహేష్‌ గౌడ్‌, మేడ్చల్‌ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షులు షాఫి రుద్దీన్‌, పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు శ్రీలత బాధ్రునాయక్‌,మేడ్చల్‌ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కుర్రి మహేష్‌, 1వ వార్డ్‌ కంటెస్టెంట్‌ కార్పొరేటర్‌ ఎం.డి మజర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయుకులు వంగేటి ప్రభాకర్‌ రెడ్డి, జంగా చారి, రమేష్‌, నాదంగౌడ్‌, పవన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.