సర్కారు బడుల రూపురేఖల్లో మార్పు

– మనఊరు-మనబడి కార్యక్రమాలు విజయవంతం చేయాలి
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సరికొత్తగా సర్కారు బడులు కొనసాగించడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కందుకూరు మండల్‌ రాచులూరు గ్రామంలో మనఊరు- మనబడి పాఠశాలను జడ్పీ చైర్‌పర్సన్‌ తీగెల అనితా రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రారంభించి, విద్యార్థులకు కొత్త నాంది శకం మొదలవు తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల పాఠశాలలు మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. నేడు 600 పాఠశాలలను మనఊరు- మనబడి కార్యక్రమం కింద ప్రారంభించినట్టు తెలిపారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. ప్రయివేట్‌ పాఠశాలలో అధిక ఫీజులు కట్టి, బస్సులకు చార్జీలు చెల్లించి ఆర్థికంగా నష్ట పోవద్దని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యా, ఉచిత భోజనం తోపాటు, దుస్తులు, సరఫరా చేస్తుం దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గురుకులాలలో విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్షా ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ప్రపంచంలో పోటీపడి చదివించడమే కాకుండా విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. మన ఊరు మనబడి కార్య క్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి, విద్యాశాఖ కార్యదర్శులు కరుణ, దేవసేన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌, జెంట్‌ కలెక్టర్‌ పత్రిక జైన్‌, డీఈవో సురేందర్‌ రావు, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మహేశ్వరం మార్కెటింగ్‌ చైర్మన్‌ సురసాని సురేందర్‌ రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, ఆర్డీవో సూరజ్‌ కుమార్‌, ఎంపీడీవో వెంకట్‌ రాములు, ఎంఈఓ కష్ణ, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీలు బాలరాజ్‌ , తాండ్ర ఇందిరా దేవేందర్‌, సురేష్‌, , బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గుయ్యని సామయ్య, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు , అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.