నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సుభాష్‌నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం రాజీవ్ గృహకల్పలో సుమారు రూ.38 లక్షల జీహెచ్‌ఎంసీ నిధులతో పూర్తి చేసుకున్న సీసీ రోడ్డును శనివారం కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తనను గెలిపించిన తర్వాత సుమారు రూ.125 కోట్లతో అభివృద్ధి పనులను చేసుకున్నమన్నారు. మిగిలిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజ పనులకు అధికారులతో ఎస్టిమేషన్ చేయించినట్టు తెలిపారు. ఈ ఎస్టిమేషన్‌లను, మునిసిపల్ అధికారులకు, వాటర్ వర్క్స్ ఎండీకి ఇచ్చి వీలైనంత త్వరలో మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. త్వరలోనే మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తానని కార్పొరేటర్ హామీనిచ్చారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించ డానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాజీవ్ గృహకల్ప వాసులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.