– కార్పొరేటర్ హేమలత సురేష్‌రెడ్డి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సుభాష్ నగర్ 130 డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే కేపీ వివేకానంద, తెలంగాణ శాసనమండలి విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహకా రంతో సుమారు రూ.1 కోటితో సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు. గురువారం సిమెంట్ రోడ్డు వేయించిన కార్పొరేటర్కుసుభాష్ నగర్ వాసులు కతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బస్తీ వాసులు మాట్లాడుతూ.. తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న సురేష్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో తామంతా కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.