సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్ని ప్రమాద మాక్‌టెస్ట్‌

హైదరాబాద్‌ : అగ్ని ప్రమాదం జరిగితే ఎలా అప్రమత్తంగా ఉండాలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీసులో మాక్‌టెస్ట్‌ను నిర్వహించారు. దీన్ని గౌలిగూడ ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రదర్శించి చూపారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్‌కు చెందిన 230 మందికి పైగా ఉద్యోగులు పాల్గొని.. ఆసక్తిగా గమనించారు.