”హమారా ప్రసాద్‌” వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలి

– ఆర్‌ఎస్‌ఎఎస్‌ ఎజెండాను అమలు చేయడానికే విధ్వంసపూరితమైన వ్యాఖ్యలు
– అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి
– టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్‌ యాదవ్‌
నవతెలంగాణ-బోడుప్పల్‌
భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల అశాజ్యోతి డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ వెనుక ఎవరన్నారనే దానిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఇతర రాష్ట్ర సర్కారుపై ఉందని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ అన్నారు. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కందుకూరి నవీన్‌ అధ్వర్యంలో శనివారం నాడు బోడుప్పల్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా హాజరైన వజ్రేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల మధ్య ఉద్రేకాలను రెచ్చగొట్టేలా, దళితులపై దాడులు జరిగేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. బీజేపీ కుట్రలో భాగంగా ప్రణాళికాబద్దంగా విధ్వంసాలకు తెరతీస్తుందని దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసి విచ్ఛిన్నకరమైన పద్ధతులలో పాలన సాగిస్తూ, మతం అనే అజెండాను అమలు చేయాలని చూస్తూ తిRssనే ఆహారంపై, అచార వ్యవహారాలపై ఒత్తిడిలు తీసుకువస్తున్నారని అన్నారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గం బి బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌గౌడ్‌, బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్‌ గౌడ్‌, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్‌గౌడ్‌, మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్‌, మేడ్చల్‌ నియోజకవర్గం బిబ్లాక్‌ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు కుర్ర మహేష్‌, బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు తోటకూర అజరు యాదవ్‌, బొమ్మక్‌ కల్యాణ్‌, నాయకులు మధుసూదన్‌ రెడ్డి, బాలరాజ్‌ గౌడ్‌, పోగుల వీరారెడ్డి, రాపోలు శంకరయ్య, సింగిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.