– నైట్ ఫ్రాంక్ వెల్లడి
హైదరాబాద్ : కొత్త ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో నివాస రిజిస్ట్రేషన్లలో తగ్గుదల చోటు చేసుకుందని నైట్‌ఫ్రాంక్ ఓ రిపోర్టులో తెలిపింది. గడిచిన నెలలో హైదరాబాద్‌లో 4,872 యూనిట్ల నివాస ప్రాపర్టీలు నమోదయ్యాయని పేర్కొంది. వీటి మొత్తం విలువ రూ.2,494 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఏడాదికేడాదితో పోల్చితే యూనిట్ల పరంగా 35 శాతం, విలువ పరంగా 26 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. హైదరాబాద్ నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజి గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలను నైట్‌ఫ్రాంక్ పరిగణలోకి తీసుకుంటుంది. గత కొన్ని త్రైమాసికాల్లో నగరం సగటు ధరలలో పెరుగుదలను కూడా చూసిందని తెలిపింది. ఇది మొత్తం అమ్మకాల ఊపు మందగించడానికి ఓ కారణమని పేర్కొంది.