మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10,000 /- జరిమానా

నవతెలంగాణ-గోవిందరావుపేట: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10,000/- రూపాయల జరిమానా విధించిన సంఘటన మండలంలో జరిగింది. గురువారం స్థానిక పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ కథనం ప్రకారం.. ఈ నెల తొమ్మిదిన సిబ్బందితో కలిసి పసర గ్రామంలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో చుక్క సాయిరాం అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడడం జరిగిందన్నారు. నిందితున్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా గౌరవ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి నిందితుడైన డ్రైవర్ సాయిరాం కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఎవరైనా త్రాగి వాహనం నడిపితే చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయి అని ఎస్ఐ మస్తాన్ చెప్పటం జరిగింది.