– హీరో మోటో కార్ప్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్‌లో 1000 హార్టే డెవిడ్సన్ ఎక్స్440 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హీరో మోటో కార్ప్ తెలిపింది. తమ 100 డీలర్‌షిప్‌లలో ఈ వాహన డెలివరీలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. డెనిమ్, వివిడ్, ఎస్ లాంటి మూడు వేరియంట్లలో లభించే ఈ మోడల్ ధరలను వరుసగా రూ.2,39,500, రూ.2,59,500, రూ.2,79,500గా నిర్ణయించింది.