1000 షోలు..

ఈనెల 20న యువ కథానాయకుడు ఎన్టీఆర్‌ బర్త్‌డే.
ఆయన బర్త్‌డేని పురస్కరించుకుని ‘సింహాద్రి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20న రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం 1000 షోలను ప్లాన్‌ చేయటం విశేషం.
ఈ నేపథ్యంలో రీ- రిలీజ్‌ ఈవెంట్‌ను బుధవారం గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘ఓ హీరో బర్త్‌ డే సందర్భంగా పాత సినిమాకి వెయ్యి షోలు వేయడం మామూలు విషయం కాదు’ అని అన్నారు. మైత్రీ మూవీస్‌ అధినేత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ, ”సింహాద్రి’ అనేది ఓ చరిత్ర. అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది.
అటువంటి ఎన్టీఆర్‌తో మేం మళ్లీ ఓ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకులు, భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ వచ్చారు.