మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

లహరి ఫిల్మ్స్‌, చాయ్ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ‘మేమ్‌ ఫేమస్‌’. దీనికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్ర పోషించారు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో అశేష ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ హీరో నాని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకకు ‘దసరా’ దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన, చిత్ర నిర్మాతలు అనురాగ్‌ తదితరులు హాజరయ్యారు. నాని మాట్లాడుతూ, నిర్మాతలు గుడ్‌ కంటెంట్‌ను ప్రెజెంట్‌ చేస్తున్నారు. ‘చూస్తూ.. చూస్తూ.’ సాంగ్‌, డాక్టర్స్‌కు అంకితంగా ‘దారేలేదా..’ అనే చిన్న షాట్‌ ఫిల్మ్‌ తీసిన సుమంత్‌ తనే హీరోగా, దర్శకుడిగా మారి ఈ సినిమా చేయడం విశేషం. ఈరోజుతో చాలు ఆపేయండి ఆ ప్రమోషన్‌ ట్రెండ్‌. ఈనెల 26న మేమ్‌ ఫేమస్‌కు తీసేయండి బాక్సాఫీస్‌ బెండ్‌’ అని అన్నారు.

Spread the love