11న ఎస్సై సాంకేతిక పోస్టులకు పరీక్షలు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సాగుతున్న ఎస్సై తత్సమాన పోస్టులకు తుది రాత పరీక్షలో భాగంగా ఎస్సై (ఐటీ) పోస్టులకు ఈనెల 11న తుది రాత పరీక్ష జరపను న్నట్టు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెం ట్‌ బోర్డు చైర్మెన్‌ వీవీ శ్రీనివాస రావు శనివారం తెలిపారు. అదే రోజు ఏఎస్‌ఐ (ఫింగర్‌ ప్రింట్స్‌) పోస్టులకూ అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఆయన చె ప్పారు. ఉదయం 10 గంటల నుచి మధ్యాహ్నం 1 వరకు ఎస్‌ఐ (ఐటీ) అభ్యర్థులకు టెక్నికల్‌ పేపర్‌ ఉంటుందనీ, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5.30 వరకు ఏఎస్‌ఐ (ఎఫ్‌ బీ) టెక్నకల్‌ పేపర్‌ ఉంటుందని ఆయన తెలిపారు.