21 నుంచి ఐఎస్‌ఎల్‌ తొలిసారి రేసులో 12 జట్లు

హైదరాబాద్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) పదో సీజన్‌కు ముస్తాబైంది. ఐ-లీగ్‌ జట్లు సైతం లీగ్‌లో పోటీపడుతున్నాయి. దీంతో పదో సీజన్లో టైటిల్‌ రేసులో 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్‌ 21న కేరళ బ్లాస్టర్స్‌, బెంగళూర్‌ ఎఫ్‌సీతో సీజన్‌ షురూ కానుండగా.. మాజీ చాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ టైటిల్‌ వేటను సెప్టెంబర్‌ 22న గోవా ఎఫ్‌సీతో మొదలుపెట్టనుంది. డిసెంబర్‌ 29న చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగియనుండగా.. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచులు మొదలవుతాయి.