బెంగళూరు: కర్నా టకలో బాణసంచా పేలి ఏకంగా 13 మంది దుర్మ రణం చెందారు. బెంగ ళూరు నగర శివారు ప్రాం తంలో తమిళనాడు సరిహ ద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోడౌన్‌కు తమిళనాడు శివకాశి నుంచి నవిన్ గోడౌన్‌కు బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా మొత్తం 13మంది చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఆస్పత్రికి వెళ్లి..గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారి కి ప్రాణనష్టం జరగకుండా మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.