నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసు శాఖలోని 141 మంది ఇన్‌స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా పదోన్నతులు ఇచ్చినట్టు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ గురువారం తెలిపారు. విధి నిర్వహణలో వీరు చూపించిన ప్రతిభా సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఈ పదోన్నతులు ఇచ్చామని ఆయన చెప్పారు. ఇటీవలనే దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మరో 175 మంది ఏఎస్సైలకు సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులిచ్చామని ఆయన తెలిపారు.