కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌.. 150 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరిక

– పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియనాయక్‌
నవతెలంగాణ-బయ్యారం
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మంగళవారం బిఆర్‌ఎస్‌ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భానోత్‌ హరిప్రియ నాయక్‌ ఇల్లందు మండలంలోని ధనియాలపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచా రంలో బయ్యారం మండలంలోని రామ చంద్రా పురం గ్రామపంచాయతీకి చెందిన సింగారం, పందిపాడు, వెంకటాపురం గ్రామ పంచాయతీకి చెందిన నరసాపురం, కొత్త గుంపు, లక్ష్మీపురం, టేకుల గూడెం నుంచి 3 వార్డు సభ్యులు సభ్యులు, కాంగ్రెస్‌ కి చెందిన 150 కుటుంబాల వారు స్వచ్ఛందంగా ఇల్లందు మండలం ధనియాలపాడుకు వెళ్లి మండల అధ్యక్షుడు తాత గణేష్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ నాయక్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్‌ మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి మన ఊరికి వచ్చి వెళ్లే వాళ్ళు కావాలా, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించే బీఆర్‌ఎస్‌ పార్టీ కావాలా అని అన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొ క్కటిగా పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని కూడా పరిష్కరింప చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని కావున నవంబర్‌ 30వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు మీ మీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. పార్టీలో చేరిన వార్డు సభ్యులు రామచంద్రపురం వార్డ్‌ నెంబరు మాలోత్‌ శారద, వెంకటాపురం వార్డు మెంబరు సనప వెంకటేశ్వర్లు, లక్ష్మీపురం సనప నరేష్‌ తదితరులు ఉన్నారు.